తెదేపా జిల్లా కమిటీలోకి ఎస్ఎం డీ జమీల్
1 min read

నందికొట్కూర్ నుండి ముగ్గురికి చోటు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా కమిటీలోకి నందికొట్కూరు నియోజకవర్గం నుండి ముగ్గురికి చోటు దక్కింది.టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్లమెంట్ కమిటీల పేర్ల జాబితాను జారీ చేశారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన ఎస్ఎం డీ జమీల్ అహ్మద్ ను నంద్యాల జిల్లా టీడీపీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. గత ఎన్నికల్లో విజయానికి జమీల్ ఎంతగానో కృషి చేశారు.పదవి వచ్చినందుకు గాను టిడిపి నేత మాండ్ర శివానందరెడ్డికి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు కృతజ్ఞతలు తెలిపారు.నాకు పదవి అప్పగించడంతో పార్టీపై నాకు మరింతగా బాధ్యత పెరిగిందని రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని గురువారం సాయంత్రం జమీల్ అన్నారు. నందికొట్కూరు నుండి జిల్లా కమిటీలోకి ముగ్గురికి స్థానం లభించగా మిగతా ఇద్దరూ కే ప్రసన్నలక్ష్మికి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ ను నియమించారు.

