భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోధుల పార్టీ అని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష అభిప్రాయపడ్డారు. ఆదివారం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 1885 వ సంవత్సరం డిసెంబరు 28వ తేదీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని మహాత్మాగాంధీ , పండిట్ జవహర్లాల్ నెహ్రూ , అంబేద్కర్ మొదలైన ముఖ్య నాయకులు సభ్యులుగా ఉన్నారని స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ నాయకుల పాత్ర అమోఘమని, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని సర్వమతాలను సమాన దృష్టితో ప్రజా పాలన సాగించిందని జిలాని భాష అభిప్రాయపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది కార్యకర్తలకు రాజకీయ భవిష్యత్తు నిచ్చిందని గల్లీ నాయకులను కూడా ఢిల్లీకి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ ప్రధాని అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వస్తాయని, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట నిలుపుకోలేని బిజెపి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరును మార్పు చేసి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని తెలియజేశారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద గల గాంధీపార్కు నందలి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం ముందు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష పార్టీ పతాకమును ఎగురవేసి వందన సమర్పణ గావించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు ఎం సుధాకర్ బాబు, కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్ సి బజారన్న, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, ఓ బి సి జిల్లా అధ్యక్షులు డి వి సాంబశివుడు, ఐ యన్ టి యు సి సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు షేక్ మాలిక్ భాష, బి సుబ్రమణ్యం, రియాజుద్దీన్ వార్డు ఇన్చార్జి ఎన్ సుంకన్న, జోసఫ్ నోయెల్, అబ్దుల్ హై, కిషోర్, రంగస్వామి, ఆసిఫ్ అలీ ఖాన్ మొదలగు వారు పాల్గొన్నారు.

