కుటుంబాన్ని ఆదుకున్న జనసేన కార్యకర్తలు
1 min read

11 వేల ఆర్థిక సహాయం అందజేసిన జనసేన యువకులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ (జనసేన పార్టీ) సంపత్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా తమ వంతుగా ఆదుకున్నారు. మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామానికి చెందిన సంపత్ కుమార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మొదటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.గత కొద్దిరోజుల క్రితం నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఈయనకు జనసేన పార్టీ నుండి అవకాశం లభించింది. కానీ గత 6 నెలల నుండి పెద్దప్రేగు క్యాన్సర్ తో అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు విఆర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మిడుతూరు జనసేన యువకులు గుడిపాడు ప్రభాకర్ మరియు కళ్యాణ్ విషయం తెలుసుకొని తమ వంతుగా 11వేల రూ.లను సోమవారం వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం చేశారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు దేవుడు మిమ్మల్ని దీవించాలని వారు కోరారు.సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంతరెడ్డి, రమేష్ బాబు,సురేష్,షేక్షావలి పాల్గొన్నారు.

