NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభినయ నృత్య భారతి 30వ జాతీయస్థాయి  నృత్యోత్సవాలు, నృత్య పోటీలు

1 min read

150మంది విజేతలకు జ్ఞాపికలు,నగదు బహుమతులు అందజేత 

ఏలూరు, న్యూస్​ నేడు: ఏలూరులోని వై. ఏం.హెచ్.ఏ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారి సహకారంతో  గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అభినయ నృత్యభారతి 30వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు,నృత్య పోటీలు మూడవరోజు ఆదివారం ఉదయం నుండి కూచిపూడి,జానపద సీనియర్స్ కేటగిరి,బృంద నృత్యపోటీలు అత్యంత వైభవంగా జరిగాయి.ఈ పోటీలలో చివరి రోజు 150మంది చిన్నారి,యువ నర్తకులు పాల్గొని వారి ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు,విజేతలకు జ్ఞాపికలు,నగదు బహుమతులు అందించారు.సాయంత్రం 5.30గంటల నుండి 7.30గంటల వరకు జాతీయ స్థాయి శాస్త్రీయ యువ నృత్యోత్సవాలు నిర్వహించారు. లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్.వి.వి. ఎస్.పాపారావు నాయుడు నృత్యోత్సవాలను ప్రారంభిస్తూ  భవిష్యత్తులో నాట్యాచార్య లయన్ దువ్వి హేమసుందర్ ద్వారా జాతీయ,అంతర్జాతీయ  స్థాయిలో లయన్స్ ఆధ్వర్యంలో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని తెలిపారు.విశాఖపట్నంకు చెందిన కుమారి గాయత్రి కూచిపూడి నృత్యం,ఒరిస్సా బరంపురం నకు చెందిన కుమారి తులిక రెడ్డి ఒడిసి నృత్యం,చెన్నైకు చెందిన డి.చక్రవర్తి కూచిపూడి నృత్యం,కరీంనగర్ కు చెందిన టి.సంతోష్ పెరిణి శివతాండవం,సామర్లకోటకు చెందిన చక్రవర్తుల పవన్ కుమార్ కూచిపూడి నృత్యం,వరంగల్లు కు చెందిన కుమారి బి.వైష్ణవి పేరిని లాస్యం,కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత కాకినాడకు చెందిన బి. మల్లిఖార్జునరావు ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాయి.వీరందరికి సంస్థ తరపున నృత్య కౌముది అవార్డులు అందించారు.ప్రఖ్యాత కూచిపూడి నృత్య గురువు యక్షగాన ఖంటీరవ డా.పసుమర్తి శేషుబాబు గారికి భరత కళాప్రపూర్ణ శ్రీ కోరాడ నరసింహారావు మెమోరియల్ నృత్య రంగ సేవాతపస్వి అవార్డుతో సత్కరించారు. అనంతరం జరిగిన అవార్డులు మరియు బహుమతి ప్రదానోత్సవ సభకు ఆర్.టి.సి విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు,లయన్స్ పూర్వపు గవర్నర్లు దామెర రంగారావు,వేమా కోటేశ్వరరావు ఉత్సవాల ఆహ్వాన సంఘం కార్యదర్సులు లేళ్ల వెంకటేశ్వరరావు,దువ్వి రామారావు సంస్థ ప్రతినిధులు డా. ముసునూరి వెంకట ప్రసాద్,యర్రా హరనాధ్,కానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About Author