బాధ్యతలు చేపట్టిన మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామి రెడ్డి
1 min read

పారిశుద్ధ్య కుటుంబానికి 15 వేలు అందజేత..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని నూతన మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఉదయం నూతన మున్సిపాలిటీ కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఈయన తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.ఇక్కడ పనిచేస్తున్న మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ అమరావతి సిడిఎంఏ లో రిపోర్ట్ చేసుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె వెళ్లారు. మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు,అధికారులు నూతన కమిషనర్ ను కలిసి పూలబోకెలతో శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపాలిటీలోఆప్కాస్ కింద పారిశుద్య కార్మికుడిగా పనిచేస్తూ చెరుకు మారన్న అనారోగ్యంతో మృతిచెందారు.మున్సిపాలిటీ చైర్మన్ మరియు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ఆయన ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు.వారు కుటుంబానికి 15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.కుటుంబాన్ని ఆదుకుంటామని మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ దినేష్ కుమార్,కౌన్సిలర్లు చాంద్ భాష,అబ్దుల్ రవూఫ్,లాలు ప్రసాద్,ఉస్మాన్ బేగ్,సప్లయర్ సత్యనారాయణ మరియు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.


