NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమాచార హక్కు చట్టం పౌరులకు శక్తివంతమైన ఆయుధం

1 min read

జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు యు.సురేంద్రనాథ్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : స్థానిక జిల్లా పౌరసంబంధాధికారి కార్యాలయంలో మంగళవారం ఆర్టీఏ చట్టం 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అవగాహన ర్యాలీని జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు యు. సురేంద్రనాథ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.అనంతరం జిల్లా పౌరసంబంధాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు యు.సురేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని ప్రోత్సహించ డానికి పౌరులకు సమాచార సాధికారతను అందించడానికి ఉద్దేశించబడిన  మంచి కార్యక్రమం అని అన్నారు. అధికారులు సకాలంలో సమాచారం అందించి, పౌరులకు సంతృప్తికరమైన సేవలు అందించాలని కోరారు. ఈ చట్టం ద్వారా ఎంతో మందికి ప్రయోజనం పొందుతున్నారని, ఇది సుపరి పాలనకు కీలకమని తెలిపారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం యివ్వాలని, అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే ఆర్టిఏ చట్టప్రకారం ఆయా అధికారులకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు.డివిజనల్ పౌరసంబంధాధికారి సి.హెచ్.కనకదుర్గ ప్రసాద్ లింగం మాట్లాడుతూ ధరఖాస్తు రుసుంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, దారిద్య రేఖకు దిగువ కలిగిన పౌరులు తమ రేషన్ కార్డును నకలును ధరఖాస్తుకు జతచేస్తే ఉచితంగా కోరిన సమాచారాన్ని పొందవచ్చునని తెలిపారు. పౌరులు తమకు కావలసిన సమాచారాన్ని మాత్రమే కోరాలని, అనవసరమైన సమాచారం కొరకు అర్జీలు పెట్టుకుంటే విలువైన సమయం ఇరువురికి వృధా అవుతుందని ఆలోచన చెయ్యాలని కోరారు.ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంటు డి.లక్ష్మీ, టైపిస్టు డి.సౌరిప్రసాదు, సిబ్బంది ఆర్.మల్లిబాబు, యస్.గంగాధర్, పి.సాగర్, వి.సధ్యకమల, పి.శారద, వి.యస్.ప్రభాకర రావు, యం.మరియ రేష్మ, వి.వి.రామారావు, తదితరులు పాల్గొన్నారు.

About Author