NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిఐజీ గా పదోన్నతి పొందిన ఎస్పీకి శుభాకాంక్షల వెల్లువ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ కర్నూల్ వారిని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూల్ నగర  అధ్యక్షులు ఎంసీ కాశన్న ఆధ్వర్యంలో కర్నూల్ నగర సంఘ పక్షాన 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్ నూతన డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ఎస్పీ  చేత చేయించడం జరిగినది. మరియు ఎస్పీ కి డిఐజీ గా పదోన్నతి వచ్చినందున ప్రత్యేక శుభాకాంక్షలు కూడా సంఘ పక్షాన తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కర్నూల్ నగర కార్యదర్శి ఎం రామకృష్ణ, పంచాయతీ సెక్రెటరీల అసోసియేషన్ నాయకులు గిరి శ్రీకాంత్ మరియు వారి కార్యవర్గము, మరియు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నగర కార్యవర్గము, మరియు ఆంధ్రప్రదేశ్ టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author