NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చౌట్కూరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : మాండ్ర

1 min read

స్వామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాండ్ర.. ఎమ్మెల్యే

మిడుతూరు,(నందికొట్కూరు) న్యూస్​ నేడు  : రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో గ్రామ నాయకులు చిన్న గోకారి ఆహ్వానం మేరకు  శుక్రవారం మధ్యాహ్నం శివానందరెడ్డితో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి,నందికొట్కూరు మిడుతూరు మండల కన్వీనర్లు మాండ్ర సురేంద్ర సురేంద్ర నాథ్ రెడ్డి,కాతా రమేష్ రెడ్డి హాజరయ్యారు. గోకారి ఆధ్వర్యంలో శివానందరెడ్డికి ఘన స్వాగతం పలికారు.గోకారి ఇంటికి వెళ్లిన శివానందరెడ్డికి గ్రామంలో ఉన్న సమస్యల గురించి గ్రామస్తులు వివరించారు.గ్రామంలోని కాలనీల్లో అవసరం ఉన్నచోట సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.తర్వాత గోకారి వారిని శాలువాలతో సన్మానించారు.రోళ్లపాడు గ్రామ మాజీ సర్పంచు రామస్వామి రెడ్డి కుటుంబాన్ని శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరామర్శించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,సంపంగి రవీంద్రబాబు, నాగేంద్రుడు,రమణారెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author