NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా విద్యకు ప్రాణం పోసిన మహానీయురాలికి గజ్జహళ్లిలో ఘన నివాళి

1 min read

హోళగుంద న్యూస్ నేడు: సావిత్రిబాయి పూలే 195వ జయంతి – వైస్ ఎంపీపీ మహాదేవమ్మ నాయకత్వంలో చరిత్రాత్మక కార్యక్రమం.మహిళలకు చదువు నిషేధంగా ఉన్న చీకటి కాలాన్ని చీల్చి, విద్య అనే వెలుగును సమాజానికి అందించిన మహాత్మ సావిత్రిబాయి పూలే 195వ జయంతిని హోళగుంద మండల వైస్ ఎంపీపీ మహాదేవమ్మ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కెంచప్ప ఆధ్వర్యంలో గజ్జహళ్లి గ్రామంలో ఘనంగా, చైతన్యభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గజ్జహళ్లిలో ఒక సామాజిక స్పూర్తి సభగా మారింది.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కెంచప్ప మాట్లాడుతూ…1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో జన్మించిన సావిత్రిబాయి పూలే, భారత మహిళా విముక్తి ఉద్యమానికి పునాది వేసిన అగ్నిజ్వాల అని కొనియాడారు.ఆ కాలంలో మహిళలకు చదువు పాపమని భావించిన సమాజంలో, భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను ఆయుధంగా చేసుకుని దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన చరిత్రాత్మక వ్యక్తి సావిత్రిబాయి పూలే అని తెలిపారు.1848లో పూణే భిడేవాడాలో బాలికల కోసం తొలి పాఠశాల స్థాపన భారత సమాజానికి వచ్చిన విప్లవం అని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో చిట్టెమ్మ, ముకమ్మ, ఉలిగమ్మ, అంజినేయ్య, మత్తప్ప, ఉసేనప్ప, యల్లప్ప, శివకుమార్, శివలింగ, బజ్జప్ప, వీరేశప్ప, కార్లింగ, థాయప్ప, రంగప్ప, ఈరప్ప, ధనప్ప, కళింగప్ప, ఉల్లేష్, కళింగ, శేషి, వీరేష్, బాలస్వామి, రామలింగ, ప్రశాంత్, నాగప్ప, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author