NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం

1 min read

– ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి

ప్యాపిలి న్యూస్ నేడు: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం అని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డిఈసందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని షాదిఖనా భవణంలో ఎన్ సిసిఎఫ్ ఆధ్వర్యంలో ఏ.పీ. మార్క్‌ఫెడ్ నిర్వహించిన కందుల కొనుగోలు సేకరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు  కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్  ముఖ్య అతిథిగా హాజరై రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ రైతులు పండించిన కందులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ఉద్దేశంగా ఇటువంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, ఎంపిడిఓ ఎ.శ్రీనివాస రావు, తేదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి,డిఎం హరినాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, తేదేపా క్లస్టర్ ఇంచార్జ్ పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా పీర్, తెదేపా మండల అధ్యక్షులు సుదర్శన్, తేదేపా నాయకులు ఆర్ ఇ.నాగరాజు,అలేబాద్ పరమేష్, తేదేపా మండల సెక్రెటరీ నాగేంద్ర, అగ్రికల్చర్ ఎడి సునిత, తెదేపా నాయకులు మాజీ ఎంపిటిసి గోల్ల రామ్మోహన్ యాదవ్,ఏనుగమర్రి రామకృష్ణ,గుడిపాడు వెంకట రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్,జనసేన చంద్ర, డిప్యూటీ ఎంఆర్ఓ, డిసిఎంఎస్ మేనేజర్ రాజేష్, బిజెపి మద్దిలేటి, ప్రజాప్రతినిధులు,అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.

About Author