“లీగల్ ఎయిడ్ ప్యానల్ లాయర్స్ విధులు పై రివ్యూ మీటింగ్”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జి.కబర్థి, చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు కమిటీ మెంబర్స్ అయినా మొదటి అదనపు జిల్లా జడ్జి పి. కమలాదేవి, బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు, సీనియర్ న్యాయ వాది మురళీ మనోహర్ వారు కర్నూలు కోర్టు కాంపౌండ్ లో గల న్యాయ సేవా సదన్ నందు ” ప్యానల్ లాయర్స్ విధులు పై రివ్యూ మీటింగ్” నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ప్యానల్ లాయర్స్ విధులు, చట్టపరమైన సలహాలు, కేసుల వివరాలు మరియు పరిష్కారము మొదలగు అంశాలను వివరించారు.అలాగే కేసుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటిని ఏ విధంగా త్యరిత గతిన పరిష్కరించాలో అనే దానిపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, ప్యానల్ న్యాయ వాదులు పాల్గొన్నారు.

