NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనవరి 11వ తేదీ ఎస్టీ కమిషన్ చైర్మన్  ఏలూరు రాక

1 min read

కమిషనర్ చైర్మన్ సోళ్ల బోజ్జి రెడ్డిని కలిసిన దేవరకొండ వెంకటేశ్వర్లు బృందం

ఎస్ టి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈనెల 11న ఆదివారం ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ , ఐదుగురు సభ్యులు ఏలూరు గిరిజన భవన్ కు రానున్నారని ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు తెలిపారు.మంగళవారం వెంకటేశ్వర్లు బృందం కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డిని ఏలూరులో కలిసి ఆదివారం నిర్వహించబోయే కార్యక్రమానికి ఆహ్వానించింది.ఆదివారం కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులకు అభినందన సభను ఏర్పాటు చేసి సన్మానిస్తామన్నారు.అదే సభలో సేవా కార్యక్రమంగా 200 మంది పేద విద్యార్థిని, విద్యార్థులకు విద్యాపర  ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రత్యేక ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తున్న ఏ.వి.ఆర్ విజ్ఞాన కేంద్రం ఇప్పటికే అకడమిక్, కల్చరల్ అంశాల్లో పోటీలు నిర్వహించి 200 మంది విజేతలను ఎంపిక చేసింది అన్నారు. సమస్యల త్వరిత పరిష్కారం కొరకు ఎస్టీ ఉద్యోగుల సంఘం చొరవ తీసుకుంటుందని నేషనల్ ప్రెసిడెంట్ తెలిపారు. చైర్మన్ ని  ఆహ్వానించిన వారిలో గోపిరెడ్డి దుర్గ , జగన్నాథం బాలరాజు,  పేరం అంజలి, మెర్సీ ప్రిసిల్లా, సౌజన్య , కొమ్మోజు శ్రీనివాసరావు, పెరియార్, పాము రవీంద్రనాథ్, దాసరి సందేశ్, వల్లకవి శ్రీనివాసరావు, మాధవరావు, దాసరి వెంకన్న, చరణ్ తేజ, అడ్వకేట్ ప్రకాశం, దేవరపల్లి రత్నబాబు,  పీవీవీ విజయకుమార్, ప్రముఖ సామాజిక వేత్తలు విక్రమ్ కిషోర్, కారంకి శ్రీనివాసరావు,  కృష్ణ ప్రసాద్ , సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొని కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డితో ముచ్చటించారు.

About Author