శ్రీ నవనంది పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది హైస్కూల్ లో పాఠశాల చైర్మన్ బి శ్రీధర్ మరియు పాఠశాల కరస్పాండెంట్ మీనాక్షి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో బాలబాలికలచే హరిదాసు వేషాలు, భోగిమంటలు,పతంగి వేడుకలను నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు మరియు మహిళలకు (రంగవల్లులు) ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీల్లో చక్కగా వేసిన మహిళలకు బహుమతులను అందజేశారు.బహుమతులు వరుసగా ఉషారాణి,రాణి,మేరి ప్రియదర్శిని,వెంకటేశ్వరి,రేణుక,మాధవి ముగ్గుల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారు.వీరికి పాఠశాల చైర్మన్ మరియు కరస్పాండెంట్ బహుమతులను అందజేశారు.తర్వాత ఫుడ్ మేళా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో సరళ,రాధా మాధవి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

