NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీ నిర్ణయించిన గడువు కంటే ముందుగానే కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం

1 min read

ఆలూరు న్యూస్ నేడు: కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి  అధ్యక్షతన బిర్లా గేట్ సమీపంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి , తనయుడు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్  మాట్లాడుతూ, పార్టీ నిర్ణయించిన గడువు కంటే ముందుగానే కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకూ కమిటీల్లో తగిన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే గ్రామస్థాయి నుంచే పార్టీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందని, అందుకే గ్రామ కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన  పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి , నంద్యాల–కర్నూలు జిల్లాల పరిశీలకులు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి , గంగుల ప్రభాకర్ రెడ్డి , నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి , మాజీ ఎంపీ బుట్టా రేణుక  మేయర్ బి వై రామయ్య , ఎమ్మెల్సీ  మధుసుధన్ , ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి , సమన్వయకర్త అధిములపు సతీష్ , మంత్రాలయం ప్రదీప్ రెడ్డి , ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త రాజీవ్ రెడ్డి , తదితర ముఖ్య నాయకులు మరియు  జిల్లా కమిటీ సభ్యులు,  వైయస్సార్​సిపి నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

About Author