వృద్ధులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు…అద్దాలు పంపిణీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : బాల సాయి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బాలసాయి కంటి ఆసుపత్రి,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న బాలసాయి కంటి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ నిర్ణీత సమయంలో కంటి అద్దాలను మార్చుకోకపోతే కంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి సమస్యల బారిన పడిన వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా పిల్లలు సరైన వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

