NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిద్ధార్థ రెడ్డి చొరవతో రైతు రంగస్వామికి కోడెద్దులు

1 min read

కుటుంబానికి అండగా నిలిచిన సిద్ధార్థ రెడ్డి,మాజీ ఎంపీ పోచా..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన రైతు జరపటి రంగస్వామికి చెందిన ఎద్దులు ఈనెల 5వ తేదీన గ్రానైట్ గుంతలో పడి మరణించిన సంగతి తెలిసిందే.ఈ కుటుంబానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద  రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తూ నూతన కోడెద్దులనుఅందజేశారు.వ్యవసాయానికి జీవనాధారమైన ఎడ్లు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.ఈ ఘటన గురించి మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కే.జగదీశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాల మేరకు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ఉదారంగా ముందుకు వచ్చి మాజీ ఎంపీ  రైతు రంగస్వామికి నూతన కోడెద్దులను సోమవారం  అందజేశారు.రైతు పడుతున్న ఇబ్బందిని గమనించి తక్షణమే స్పందించి ఎడ్లను అందజేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.రైతు కుటుంబ సభ్యులు సిద్ధార్థ రెడ్డికి మరియు మాజీ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు భరత్ రెడ్డి,యువ నాయకులు శ్రీనాథ్ రెడ్డి,పాల డైరెక్టర్ శివ శంకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి దండుగల శ్రీరాములు,సంపంగి శివకృష్ణ, బాలు పాల్గొన్నారు.

About Author