NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోగులకు అందించే వైద్యం యొక్క ప్రతి ప్రక్రియ డిజిటల్ చేయాల్సిందే

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎక్కడో ఒక చోట మొదలు పెట్టండి, వాస్తవ పరిస్థితి తెలుస్తుంది”.. ఇ ఆఫీసు పని విధానం పై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ సూచన… రాష్ట్ర ప్రభుత్వము పేపర్ లెస్ పని విధానం వంద శాతం జరగాలని లక్ష్యంగా నిర్దేశించు కుందని అందువల్ల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఇ ఆఫీస్ ద్వారా ఫైల్స్ మరియు రోగులకు అందించే వైద్యం యొక్క ప్రతి ప్రకియ డిజిటల్ చేయాల్సిందేనని ఇందుకోసం మొదట ప్రతి విభాగం లో  ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాల్సిందే నని అప్పుడే అందులో వాస్తవ ఇబ్బందులు తెలుస్తాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సందర్శన అనంతరం మెడికల్ కాలేజీలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రతి రోగికి ఒక ఐడీ కేటాయిస్తున్నామని అందులో రోగికి అందించే యొక్క ప్రతి ప్రక్రియ అప్లోడ్ చేయడం ద్వారా చేసిన పనిని ఏ స్థాయిలో నైనా అధికారులు పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చుననీ తెలిపారు. ఇందులో మనం చేసిన ప్రతి పని  కూడా ఉన్నత అధికారులకి తెలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఓ. పి వైద్య సేవలు సాయంత్రం వరకు అందించాల్సిందేనని తెలిపారు. జిల్లాస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు రెండు నుంచి మూడు వేల మందికి వైద్యం సేవలు అందితున్నాయని పని భారం ఎక్కువున్న వాటి వాస్తవమేనని మనం చేస్తున్న పనిని డిజిటలేషన్ చేయడం ద్వారా అని ఉన్నత స్థాయి అధికారులకు తెలుస్తుందని మరియు రోగులకు కూడా వారి ఆరోగ్య సమాచారం నిక్షిప్తం చేపడుతుందని ఎప్పుడు అవసరమున్న ఐడి నెంబర్ ఓపెన్ చేసి పూర్వ సమాచారం తెలుసుకొని  వైద్య సేవలు  అందించ వచ్చు నని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి.యం.ఇ లు, ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, రీజినల్ ఐ హాస్పిటల్స్ సూపరిండెంట్ సత్యనారాయణ రెడ్డి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ విజయ్ ఆనందబాబు, డాక్టర్ సిందియా శుభప్రద వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.

About Author