వికసిత భారత్ యువజన కార్యక్రమంలో మొదటి బహుమతి
1 min read

హోళగుందన్యూస్ నేడు : హోలగుంద మండలంలోని ఇంగలదాహల్ గ్రామానికి చెందిన బేగారి మల్లేష్,పార్వతి దంపతుల కూతురు నందిని ఇంగలదహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుని అనంతరం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర డ్యాన్స్ అండ్ సింగింగ్ కళాశాలో 3వ సంవత్సరం చదువుతుంది.నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న వికసిత భారత్ యువజన కార్యక్రమంలో పాల్గొన్న నందిని ప్లోక్ సాంగ్ పాడి మొదటి బహుమతిని అందుకున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి ఢిల్లీలో ప్రదాని కార్యక్రమంలో పాల్గొని పాడటం చాలా సంతోషకరం అని తల్లిదండ్రులు గ్రామస్తులు విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు.


