హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
1 min read

సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం అయిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నందికొట్కూరు.పట్టనము వాల్మీకి నగర్ లో పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సంక్రాంతి పండగ సందర్భంగా భోగిమంటల్లో 4 లేబర్ కార్డులను రద్దు చేయాలనిప్రభుత్వమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ(పీపీపీ) విధానాన్ని రద్దు చేయాలనిఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని భోగిమంటల కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వడ్డే రాజు,భాస్కర్ గౌడ్,వాసు,రామకృష్ణ,వెంకటేశ్వర్లు,బేబీ పాల్గొన్నారు.

