NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయస్థాయి పోటీలలో టీజీ వెంకటేష్ జట్టుకు రండవ స్ధానం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆత్రేయపురంలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగిన జాతీయస్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో టిజి  వెంకటేష్ కర్నూలు బోటింగ్ క్లబ్ జట్టు రెండవ స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ కర్నూలు బోటింగ్ క్లబ్ జట్టుకు కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు  శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ,ఎంపీ  హరీష్,ఎమ్మెల్సీ  రాజశేఖరం,ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లు ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని అందజేశారు.రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ సెక్రెటరీ అవినాష్ శెట్టి,డి.ఎస్.ఏ వాటర్ స్పోర్ట్స్ కోచ్ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

About Author