రేపే ఉభయ తెలుగు రాష్ట్రాల 60 మందికి పైగా ఏకపాత్రల ప్రదర్శనలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక వారిచే స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి స్మారక రాష్ట్రస్థాయి ఏకపాత్రాభినయ పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 60 మంది రంగస్థలం కళాకారులు కర్నూలు నగరం నందలి టిజివి కళాక్షేత్రంలో వివిధ రూపాల ఏకపాత్రాభినయపోటీలు రెండు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి. జాతీయస్థాయి ఏకపాత్రాభినయ మొదటి బహుమతి 5016 నగదు, మెమెంటో, ప్రశంసా పత్రం, రెండవ బహుమతి 3016 నగదు, మెమెంటో ప్రశంసా పత్రము, మూడవ బహుమతి 2016 నగదు, మెమెంటో ప్రశంసా పత్రము,బహుమతులతో పాటు, ముగ్గురికి ప్రత్యేక జూరీ అవార్డు 1016 నగదు, మెమెంటో, ప్రశంసా పత్రములు, అందజేస్తున్నామని జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీల నిర్వాహక కార్యవర్గ సభ్యులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత,,,,పి హనుమంతరావు చౌదరి, వివి రమణ ఆచారి, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, సీబీ అజయ్ కుమార్, కళా ప్రియ తిరుపాలు, వివి రమణారెడ్డి, పి దస్తగిరి, డి పార్వతయ్య, డి పుల్లయ్య తెలిపారు. 18,19వ తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి ఏకపాత్రాభినయ పోటీలకు వైజాగ్, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరు, మహబూబ్ నగర్,హైదరాబాద్, కరీంనగర్, నెల్లూరు, కడప, నంద్యాల, అనంతపూర్, కర్నూలు జిల్లాల నుండి, రావణబ్రహ్మ, నారద, సత్య హరిచంద్ర, భవాని శంకరం, బృహన్నల, చాణక్య, బావోజి, నక్షత్రక, అల్లూరి సీతారామరాజు, సుయోధన, కర్ణ, రుద్రమదేవి, చంద్రమతి, శ్రీకృష్ణ, అర్జున, పౌరాణిక సాంఘిక ఏకపాత్రలు విభిన్నంగా, వినూత్నంగా ప్రదర్శించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి స్మారక నివాళి టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న పత్తి ఓబులయ్య, మహమ్మద్ మియా, నందమూరి అభిమానులు, నాయకులు,ముఖ్యఅతిథిలుగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ నివాళి పూజ కార్యక్రమం అనంతరం జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించబడును. రంగస్థల కళాకారులు, కళాభిమానులు, పౌరాణిక పద్య ప్రేమికులు, తప్పక ఈ పోటీలను తిలకించి, ఆనందించవలసినదిగా అధ్యక్షులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, పి ,హనుమంతరావు చౌదరి, సమన్వయకర్త డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, డీ పుల్లయ్య, డిఎన్వి సుబ్బయ్య, ఏ జయరాముడు, ఎస్ నజీర్ అహ్మద్, ఎం బీసన్న, సమావేశంలో పాల్గొని, కళాభిమానులకు, కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులకు స్వాగతం పలికారు.

