NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర మైనారిటీ మంత్రిని కలిసిన టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ

1 min read

హోళగుంద న్యూస్ నేడు: రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మాత్యులు శ్రీ ఎన్.ఎం.డి ఫారూక్ ని మరియు టిడిపి జిల్లా అధ్యక్షురాలు  గుడిసె కృష్ణమ్మ ని కలిసిన టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.అబ్దుల్ సుబాన్ బృందఆలూరు ప్రజలకు వెలుగై నిలిచిన నాయకత్వం, ఆలూరు టిడిపి ఇంచార్జివర్యులు  వైకుంఠం జ్యోతి , టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ వైకుంఠ శివప్రసాద్ గారిరువుల సూచన మేరకు. రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మాత్యులు శ్రీ ఎన్.ఎం.డి ఫారూక్ ని వారి క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయంగా కలిసిన టిడిపి కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి అబ్దుల్ సుబాన్ రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మాత్యులు శ్రీ ఎన్.ఎం.డి ఫారుక్ ని కలిసిన శుభ సందర్భంగా శాలువ పూల మాలలతో సత్కరించి.హొళగుంద మండల ముస్లిమ్స్ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణము గురించి శనివారం రాష్ట్ర మైనార్టీ శాఖ మాత్యులు శ్రీ ఎన్.ఎం.డి ఫారూక్ కి విన్నవించగా,  మైనార్టీ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించడమే కాక స్మశాన వాటిక ప్రహరీగోడ నిర్మాణానికి అవసరమైన అధికారిక ప్రతిపాదనల మంజూరు కొరకు తక్షణమే విజయవాడ మైనార్టీ రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపి, హొళగుంద ముస్లిం స్మశానవాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండల కేంద్రంలో ఉర్దూ పాఠశాలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పన మరియు ఉర్దూ ఇంటర్మీడియట్ కళాశాల నిర్మాణం కొరకు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రులు శ్రీ ఎన్.ఎం.డి ఫారుక్ ని ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది. మైనారిటీ సమూహపు విద్యా, విద్య,సామాజిక సంక్షేమంతో పాటుగా హొళగుంద మండల పురోభివృద్ధి కొరకు ప్రత్యేక తోడ్పాటును అందించవలసిందిగా కోరడమైనది.కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారిని కలిసిన శుభ సందర్భంగా శాలువ పూల మాలలతో సత్కరించి. కూటమి ప్రభుత్వపు సంక్షేమ మార్కు పాలనలో భాగంగా హొళగుంద మండల కేంద్రానికి వాడ వాడలా సిసి రోడ్లు, డ్రైనేజీలు,కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాల కల్పనములకై “స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్” (ఎస్.డి.ఎఫ్) నిధుల మంజూరు చేయించుటకు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరడమైనది. దశాబ్దాల నుంచి హొళగుంద మండల ప్రజలను పట్టిపీడిస్తున్న మరియు హొళగుంద ప్రజల జీవనాడైన ఆదోని-డాణాపురం రోడ్డు నిర్మాణం గురించి కూడా మరో మారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరడమైనది.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఆదం, బూత్ కన్వీనర్లు వలి భాష, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author