NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తిలిపిన ఏపీఎన్ జీజీఓఎస్​ నాయకులు..

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు. గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలుగా పెట్టిన మొత్తం : ₹30,000 కోట్లు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే ₹12,000 కోట్లు ఉద్యోగుల బకాయిలకు చెల్లించింది. నిన్న ₹1100 కోట్లు చెల్లించింది. 2018 మరియు 2019 కు చెందిన పెండింగ్లో ఉన్న డి‌ఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు ప్రభుత్వము నిన్న చెల్లించడము జరిగినది. ఈరోజు సిపిఎస్ ఉద్యోగులకు వారి అకౌంట్లో  5 సంవత్సరాల తర్వాత క్రెడిట్ అయినాయి. పోలీసు సోదరులకు సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడము జరిగినది. అదే విధముగా జిపిఎఫ్‌, ఎపిజిఎల్ఐ, మెడికల్ బిల్లులు పెండిగులో లేకుండా, అన్నీ చెల్లించినందుకు మరియు సంక్రాంతి పండుగ పర్వదినాన ఉద్యోగుల బకాయిలు ఒక్కొక్కరికి దాదాపు 20 వేల నుండి 80 వేల వరకు చెల్లించిన రాష్ట్ర ముఖ్య మoత్రివర్యులకు, కూటమి ప్రభుత్వానికి మరియు ఈ కార్యసాధనలో కృషి చేసిన మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యా సాగర్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రమణ కి మరియు ఎపి జెఎసి నాయకులకు APNGGOs కర్నూలు జిల్లా పక్షాన ధన్యవాదములు తెలియ చేయుచున్నాము. ఈ కార్యక్రమములో APNGGOs జిల్లా అధ్యక్షులు వి.జవహర్ లాల్, జిల్లా కార్యదర్శి కాశన్న, జిల్లా సహధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి సుధాకర్, కర్నూలు తాలూకా సహధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు సాయిరాం, కోడుమూరు తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు వలి మరియు  ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం  అధ్యక్షులు నాగేశ్వర రావు, ప్రభుత్వ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షులు మద్దిలేటి మరియు ఇతర NGGO నాయకులు తదితరులు పాల్గొనడమైనది.

About Author