వడ్డేమాన్ లో వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
1 min read

ఆల్కేమ్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలో ఆల్కేమ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వలి టొబాకో ట్రేడర్స్ అధినేతలు అబ్దుల్ సలాం,వలి భాష ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్ఫూర్తి రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి రోగులకు చికిత్సలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.శిభిరానికి 173 మంది హాజరయ్యారు.బీపీ, షుగర్ తదితర పరీక్షల నిర్వహించారు.ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లు ప్రజలకు వివరించారు అంతేకాకుండా ఆరోగ్య విషయంలో చిన్నపాటి జబ్బు వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే వెంటనే రోగాన్ని నయం చేసుకోవచ్చని డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామచంద్రుడు,కంపెనీ ఏరియా ఇన్చార్జి అరుణ్ కుమార్,షఫీ,నాయకులు సత్యం రెడ్డి,శ్రీధర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి,రవిరెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


