ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
పిజిఆర్‌యస్‌కి 24 అర్జీలు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన పీజిఆర్‌యస్‌కి 24 ఫిర్యాదులు రాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఎస్‌ఈ జె.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, సూపరింటెండెంట్ సుబ్బన్న, టిడ్కో అధికారి డాక్టర్ పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.

