NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికవర్ హాస్పిటల్స్ విజయవంతంగా 9 సంవత్సరాల ఆరోగ్య సేవలను పూర్తి

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు:  మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు విజయవంతంగా 9 సంవత్సరాల ఆరోగ్య సేవలను పూర్తి చేసుకుని గర్వంగా 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో మొదటి పేషెంట్ గా చికిత్స పొందిన శ్రీ వాసుదేవ రెడ్డి ని ఘనంగా సత్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆసుపత్రి ప్రారంభ దశ నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, తొలి రోగిని గౌరవించడం భావోద్వేగ క్షణాలకు దారి తీసింది. అనంతరం కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డా. రాజిత , క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డా. శ్రీకాంత్ రెడ్డి , మెడికవర్ హాస్పిటల్స్ మార్కెటింగ్ బృందం పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ డా. అనిల్ కృష్ణ,   సీఈఓ  హరి కృష్ణ, కార్డియాలజిస్ట్ డా. చైతన్య కుమార్  ప్రత్యేకంగ పేషెంట్ ను అభినందించారు.మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ,“గత 9 సంవత్సరాలుగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ప్రజల విశ్వాసంతో ముందుకు సాగుతోంది.  పేషంట్స్ కి మా పై ఉన్న నమ్మకం మా బలమని నమ్ముతూ, తొలి మొదటి పేషెంట్ ని సత్కరించడం మా ప్రయాణానికి ప్రతీక. రాబోయే రోజుల్లో మరింత ఆధునిక వైద్య సేవలు, అత్యుత్తమ సదుపాయాలతో ప్రజలకు చేరువ కావడమే మా లక్ష్యం” అని తెలిపారు.ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్స్ కుటుంబంలో ఐక్యతను, సేవాభావాన్ని మరింత బలపరిచిందని పాల్గొన్నవారు తెలిపారు.

About Author