పశుపోషక రైతులకు ఉచిత పశు అంబులెన్స్ తో మరింత సేవలు
1 min read

ఉచిత పశు అంబులెన్స్ సేవ వాహనాన్ని ప్రారంభించిన టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్రరెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : ఉచిత పశు అంబులెన్స్ సేవ వాహనం ద్వారా పశు పోషక రైతులకు సులభంగా సేవలు అందించడం జరుగుతుందని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలోని తెదేపా కార్యాలయంలో మంత్రాలయం , పెద్దకడబూర్ మండలాలకు కొత్త మంజూరైన ఉచిత పశు అంబులెన్స్ సేవ వాహనానికి పూజలు చేసి అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను దృష్టిలో ఉంచుకొని ఉచిత పశు అంబులెన్స్ సేవ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత సేవల ద్వారా పశువులకు తక్షణ వైద్యసహాయం అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. రెండు మండలాల్లో పశుపోషక రైతులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు 1962 ఉచిత పశు అంబులెన్స్ సేవలను 104 తరహాలో ఫిక్స్డ్ షెడ్యూల్ లెవల్లో అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఏడి వెంకటసుబ్బయ్య, రాములు నాయక్, డిఆర్ సంతోష్, అంబులెన్సు డాక్టర్స్ సుమ, జయలక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పశుపోషక రైతులు పాల్గొన్నారు.

