గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో జనవరి 26 వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ పతాకావిష్కరణ, బ్యారికేడింగ్, వేదిక అలంకరణ తదితర ఏర్పాట్లతో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ను వేడుకలకు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు..అలాగే స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని, సీటింగ్ తదితర ఏర్పాట్లను తహసీల్దార్ ను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలును ప్రతిబింబిస్తూ శకటాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు..జాతీయ సమగ్రతను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని డి ఈ ఓ ను ఆదేశించారు.. అదే విధంగా పరేడ్ గ్రౌండ్స్ లో త్రాగు నీటి ఏర్పాట్లు,పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పిడి చిరంజీవి,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

