NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీసీ రోడ్డు వెయ్యాలని  వినతి

1 min read

పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు  విన్నపం

హోళగుంద న్యూస్ నేడు: రాష్ట్ర వ్యాప్తంగా” మన వార్డు మన భాధ్యత “అనే నినాదంతో_ఎస్ డి పి ఐ_ పార్టీ తర్పున  సర్వే నిర్వహించడం జరిగింది.అందులో  భాగంగా   మన హోళగుంద మండలం హోళగుంద గ్రామంలోని 6వ వార్డు మూసా క్యాంపులో  కూడా సర్వే చేయడం జరిగింది.అక్కడ ప్రజలు గత 20 సంవత్సరములుగా జీవిస్తున్నరు కోగిలతోట మెయిన్ రోడ్డు నుండి ముసా క్యాంపు వరకు 500 మీటర్లు వరకు సీ సీ రోడ్డు లేనందున వర్షాకాలంలో నీళ్లు నిలబడి రాక పోకలకు ప్రజలకు  ఇబ్బందిగా మారింది. అందువలన వీలైనంత త్వరగా సీసీ రోడ్డు వెయ్యాలని  హోళగుంద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువది రంగమ్మ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ కుమూస క్యాంపు ప్రజలు మరియు ఎస్ డి పి ఐ సెక్రటరీ ముల్లా హఫీజ్ , అసెంబ్లీ మెంబర్ డి.యం.రహమతుల్లా ,  వార్డు ఇంచార్జ్ కె.ఆరిఫ్, నజీర్ ,నిసార్ ,అల్లాబకాష్ కోరుతు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు.

About Author