యాజమాన్య చర్యలపై రైతులకు అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఉద్యాన భవన్ లో , ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మామిడి పంటలో మొగ్గ, పూత, పింద దశలలో చేపట్టవలసిన మెళకువలు మరియు యాజమాన్య చర్యలపై రైతులకు అవగాహన కల్పించే సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మామిడి పూత దశలో పిచికారి చేయవలసిన పురుగుమందులు, తెగుళ్ల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, అలాగే పింద దశలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలపై రైతులకు సమగ్రంగా వివరించారు. మామిడికాయ నిమ్మకాయ సైజులో ఉన్న సమయంలో మ్యాంగో కవర్లు తొడగడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు.అదేవిధంగా, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, ప్రస్తుత కాలంలో మామిడి పంట ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని అడిగి, తగిన పరిష్కారాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పాల్గొన్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి , మామిడి కవర్లకు సంబంధించిన సబ్సిడీ వివరాలు, అలాగే ఇతర ఉద్యాన శాఖ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి శ్రీ రాధాకృష్ణారెడ్డి , డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి , అలాగే కర్నూలు, కోడుమూరు ఉద్యాన అధికారులు మరియు వివిధ మండలాల మామిడి రైతులు పాల్గొనడం జరిగినది.


