ఫిబ్రవరి 5న ఏపీజేఏసీ రాష్ట్ర మహాసభలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : ఫిబ్రవరి 5న విజయవాడలో జరిగే ఏపి జె ఏ సి అమరావతి 4 వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ APJAC అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ కె.వై.కృష్ణ, జిల్లా కార్యదర్శి లక్ష్మీ రాజు పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు జిల్లా కర్నూలు రెవెన్యూ భవన్ లో మహాసభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర మహా సభకు కర్నూలు నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలివెళ్లాలని ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు తెలిపారు.

