సండేల్ చంద్ర శేఖర్ కు ఘన సన్మానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: భారత 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని కొత్తపేటలోని స్వాతంత్ర్య సమర యోధుడు ఎస్.డి నారాయణ రావు నివాసం వద్ద ఆయన కుమారుడు సండేల్ చంద్ర శేఖర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగిన 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు కుమారుడు సండేల్ చంద్రశేఖర్ ను కలెక్టర్ డా.సిరి అవార్డు అందజేసి..శాలువాతో ఘనంగా సన్మానించారు.


