NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్మాత బండ్ల గణేశ్ నుకలిసిన  గట్టు తిలక్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు  నారా చంద్రబాబు నాయుడు కోసం వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు కాలినడకన బండ్ల గణేష్  చేపట్టిన సంకల్ప యాత్రలో భాగంగా  ఆదివారం కర్నూలు నియోజకవర్గంలోకి పాదయాత్ర గా  వచ్చారు. ఈ  సందర్భంగా బండ్ల గణేష్ ను కలిసి సంఘీభావం తెలిపిన ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ , ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు.  బండ్ల గణేష్ గారు లాంటి వారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని వారు చేస్తున్న పాదయాత్రను ఉద్దేశించి బండ్ల గణేష్ ను  కొనియాడారు.  కార్యక్రమంలో  టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మల్లికార్జున్  గౌడ్ , ఐటీడీపీ కర్నూల్ నగర అధ్యక్షులు కిరణ్ , తెదేపా నాయకులు రాజు యాదవ్, సందీప్, రాజశేఖర్ రెడ్డి ,నగేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author