NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న ప్యాపిలి ఎంపీడీవో శ్రీనివాసరావు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: 77వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉత్తమ ఎంపీడీవో అవార్డును ప్యాపిలి ఎంపీడీవో ఏ. శ్రీనివాసరావు కి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్తమ అవార్డు రావడంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది, నన్ను గుర్తించి ఈ అవార్డు అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్యాపిలి మండల నీ అభివృద్ధి బాటలో నడిపిస్తూ, ప్రజలకు సేవలు అందిస్తూ మరింత ఉత్సాహంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ అవార్డు ఎంపీడీవో శ్రీనివాసురావు కు రావడంతో తమ కార్యాలయం సిబ్బంది, మండల ప్రభుత్వ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

About Author