జగనన్న కాలనీ సమస్యలు పరిష్కరించండి
1 min read

మున్సిపాలిటీ కమిషనర్ కు సీపీఎం వినతి..
నందికొట్కూరు , న్యూస్ నేడు: జగనన్న కాలనీ సమస్యలు పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డిని సిపిఎం పార్టీ నాగేశ్వరరావు,సిపిఎం నాయకులు గోపాలకృష్ణ, ఉస్మాన్ భాష కాలనీ ప్రజలతో కమిషనర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీలో 2,500 పక్కా గృహాలు నిర్మించారని కాలనీలో రోడ్లు,కరెంట్,నీటి వసతి లేక ప్రజల నివాసం ఉండలేకపోతున్నారని అన్నారు.ప్రభుత్వం కనీసం వీధిలైట్లు వేసే దిక్కు లేదని ఆరోపించారు.పబ్లిక్ మినీ ట్యాంకులకు కుళాయిలు ఏర్పాటు చేయాలని వాల్స్ లేకపోవడం మూలంగా నీరు వృధా అవుతుందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.కాలనీలో రోడ్లు లేక ప్రజలు రాకపోకలకు వాహనాలు తిరగడానికి లేకపోవడం మూలంగా మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాలనీలో అంగన్వాడీ కేంద్రం,ప్రాథమిక పాఠశాల,సచివాలయం,చౌక డిపో ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారం కోసం పరిశీలించి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యకాస నాయకులు రాజు,మద్దిలేటి, సుధాకర్,కాలనీ వాసులు గోకారి,మా భాష,షేక్షావలి, తదితరులు పాల్గొన్నారు.

