అదరగొట్టేశారు గ్రూప్-1 అక్క..2 లో చెల్లి
1 min read

జలకనూరు వాస్తవ్యులు
అక్క డిప్యూటీ కలెక్టర్..చెల్లి జూనియర్ అసిస్టెంట్
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ఒకే కుటుంబంలో గ్రూప్ వన్,గ్రూప్ టు లో అక్కా,చెల్లి ఉద్యోగాలు సాధించడంతో కుటుంబంలో మరియు బంధుమిత్రుల్లో ఎనలేని ఆనందం ఎనలేని సంతోషం.. అదే నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిధిలోని జలకనూరు గ్రామంలో తొగట ఎల్ల చంద్రుడు,స్వర్ణలలిత దంపతులకు ఇద్దరూ కూతుర్లే..తొగట ప్రియాంక (అక్క)గ్రూప్ వన్ లో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కు ఎంపిక అయ్యారు.ప్రియాంక రెండుసార్లు గ్రూప్ వన్ రాశారు. మూడోసారి విజయం సాధించారు.చెల్లి తొగట సాహితీ గ్రూప్ టు లో రాసిన మొదటి సారే జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక అయ్యారు.తండ్రి ఎల్ల చంద్రుడు వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు.తల్లి స్వర్ణ లలిత గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఐసిటిసి కౌన్సిలర్ గా పని చేస్తూ మూడు నెలల క్రితం నందికొట్కూరుకు బదిలీపై వచ్చారు.

