NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాపార వృద్ధికి..90శాతం రుణం

1 min read

35 శాతం సబ్సిడీ

  • ఏపీఎంఐపి పి.డి. శ్రీనివాసులు

కర్నూలు , న్యూస్​ నేడు: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద వ్యాపార వృద్ధికి   ప్రభుత్వం  సువర్ణ అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎంఐపి పి.డి. శ్రీనివాసులు తెలిపారు.    ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్​ ఫుడ్​ ప్రొసెసింగ్​ ( ఏపీఎఫ్​ పిఎస్​ ) వ్యాపారానికి ఆధునిక సాంకేతికత జోడించి, వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాలనుకునే  వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం రుణ సౌక్యం కల్పిస్తోందని, అందులో 35 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. కేవలం 10శాతం పెట్టుబడితో వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే అవకాశం కల్పిస్తోందన్నారు.  18 సంవత్సరాలు పై బడిన వారు , ఫుడ్​ ప్రొసిసెంగ్​ రంగంలో తమ పరిశ్రమ అభివృద్ధి చేసుకోడానికి.. కొత్త పరిశ్రమ స్థాపించడానికి  ఈ పథకం కింద రుణ సౌకర్యం పొందవచ్చన్నారు.  లబ్ధిదారులు తమ అప్లికేషన్​ ను ఆన్​ లైన్​ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ప్రొసిసెంగ్​ చేయు.. ఉత్పత్తులు

 బియ్యం, మామిడి, జీడిపప్పు, మిరపకాయలు, చిరు ధాన్యాలు, కందులు, మినుములు, నువ్వులు, సన్​ ఫ్లర్​, ధనియాలు, అల్లం, స్నాక్స్​, అటవీ ఉత్పత్తులు, పాలు, చేపలు మరియు సముద్ర ఉత్పత్తులు, చింత పండు, పుట్టగొడుగులు తదితర ఉత్పత్పుల కోసం ఫుడ్​ ప్రొసెసింగ్​ ద్వారా రుణాలు ఇస్తుందని, ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఏపీఎంఐపీ పి.డి. శ్రీనివాసులు కోరారు.

About Author