NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మాఘ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము నందు ఆదివారం సాయంత్రం సామూహిక సత్యనారాయణ వ్రతం   నిర్వహించారు. వ్రతం కార్యక్రమంలో దాదాపు 300 మంది భక్తులు కూడా పాల్గొన్నారు.  వ్రతానంతరం అందరికీ కూడా తీర్థప్రసాదాలు ,భోజన వసతి ఏర్పాటు చేసినట్లు కర్నూలు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ ,   గౌరవాధ్యక్షులు చెరువు వెంకట దుర్గాప్రసాద్ ,  ఉపాధ్యక్షులు శ్యాంసుందర్ రావు తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు వేలాదిగా తరలివస్తూ.. స్వామి సేవలో నిమగ్నమవువుతున్నారని, వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.   కార్యక్రమంలో ఉపకార్యదర్శి నాగులవరం రాజశేఖర్ ,  కోశాధికారి సి ఎస్ ప్రసాద్ రావు , గౌరవ సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ,  శ్రీనివాసరాజు గారు సుబ్బయ్య , మహిళా సభ్యులు మీనాక్షి , బిందు తదితరులు పాల్గొన్నారు.

About Author