NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రామేశ్వరుడు’ను పరామర్శించిన సిద్ధార్థ రెడ్డి

1 min read

మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు    : వైసీపీ సోషల్ మీడియా మిడుతూరు మండల కన్వీనర్ మర్రి రామేశ్వరుడును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామానికి చెందిన రామేశ్వరుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు.గత నాలుగు రోజులు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చారు.విషయం తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఇంటికి వెళ్లి రామేశ్వరుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు.సిద్ధార్థ రెడ్డి వెంట మిడుతూరు జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,రవి ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు, ఉప సర్పంచ్ రామకృష్ణ,నాగేశ్వరరావు, ఇనాయతుల్ల తదితరులు పాల్గొన్నారు.

About Author