NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ అవార్డ్ అందుకున్న ఏఈ దినేష్ కుమార్

1 min read

ప్రశంసా పత్రాన్ని అందజేసిన కమిషనర్..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ బి.దినేష్ కుమార్ ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాలలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఉత్తమ అధికారులకు పశంశాపత్రాలను అందజేశారు.కానీ అసిస్టెంట్ ఇంజనీర్ దినేష్ కుమార్ అనివార్య కారణాల వల్ల నంద్యాలలో అవార్డును తీసుకోలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం నందికొట్కూరు పురపాలక శాఖ కార్యాలయంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి ఉత్తమ అవార్డు ప్రశంసా పత్రాన్ని ఏఈ   దినేష్ కుమార్ కు అందజేస్తూ శుభకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది దినేష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

About Author