NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవాడ లో  జరగబోయే రాష్ట్ర సంఘం ఎన్నికలను దిగ్విజయం చేయండి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్  మరియు ప్రధాన కార్యదర్శి డివి రమణ, నామినేషన్ వేయుచున్న  సందర్భంగా మరియు వారి ఆధ్వర్యంలో ఇతర రాష్ట్ర కార్యవర్గం కూడా నామినేషన్ వేయుచున్న సందర్భంగా   రాష్ట్ర సంఘం ఎన్నికలలో భాగంగా నామినేషన్ కార్యక్రమము లో భాగంగా కర్నూలు జిల్లా మరియు కర్నూలు జిల్లాలోని అన్ని తాలూకాల కార్యవర్గాలు వారి ఉద్యోగ మిత్రులు విజయవాడ నందు జరగబోయే రాష్ట్ర సంఘం ఎన్నికల కార్యక్రమమునకు దావాపు 150 మంది దాకా పాల్గొంటారని మరియు ఇతర ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుతూ కార్యక్రమం దిగ్విజయం చేయవలసినదిగా కర్నూలు జిల్లా సంఘ పక్షాన కోరుచున్నాము. ఈరోజు ప్రభుత్వ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఫిమేల్ విభాగంలో పనిచేయుచున్న PHN రామ తులసి మరియు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేయుచున్న హైమవతి మరియు ఇతర టెక్నీషియన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజవహర్లాల్ గారిని మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న ని గౌరవపూర్వకంగా కలిసి శాలువా మరియు పూలబోకేతో సన్మానించడం జరిగినది.ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సిస్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా సంఘం దృష్టికి తేవడం జరిగింది ఇవన్నీ విషయాలపై త్వరలో ఒక సమావేశంలో చర్చించి పరిష్కారానికి విషయం ముందుకు పోతామని జిల్లా అధ్యక్షులు వారికి హామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు సాయిరాం ఇతర మెడికల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author