లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
1 min read

హోళగుంద న్యూస్ నేడు: టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) ద్వారా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి , జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుభాన్ , సింగల్ విండో చైర్మన్ విష్ణు రెడ్డి , వైకుంఠం యూత్ గిరి,బూత్ కన్వీనర్లు తాహెర్, వలి బాషా, శాలి.అమాన్, ఐ టీడీపీ హనుమంతు,మండల మైనార్టీ కార్యదర్శి ఇలియాస్ చేతుల మీదుగా హోళగుంద మండలానికి చెందిన లబ్ధిదారులైన సయ్యద్.హబీబ్ – రూ.59,879/-, బి. ప్యారిమా బీ – రూ.20,541/-, హరిజన పావని – రూ.40,795/-, గోపాల్ రూ.43727/-, విమల రూ.16000 రూపాయలతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి,మంత్రి నారా లోకేష్ కు,లబ్ది చేకూరేలా పటిష్ట చర్యలు తీసుకున్న ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతికి,సహకరించిన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుభాన్ కి,మండల కూటమి నాయకులకు లబ్ధిదారులకు ధన్యవాదాలు తెలిపారు.

