ఘనంగా ర్యాంక్ పిప్పింగ్ వేడుక – ఎస్సిసి అధికారుల పదోన్నతి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: 28A BN NCCకార్యాలయంలో ఈరోజు పదోన్నతి పొందిన అధికారులకు “ర్యాంక్ పిప్పింగ్” వేడుక అత్యంత ఘనంగా నిర్వహించబడింది. పటలపు కార్యనిర్వహణ అధికారి శశి కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి, పదోన్నతి పొందిన వారి భుజాలపై నూతన ర్యాంక్ స్టార్లను (Insignia) అలంకరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శశి కుమార్ గారు మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం గౌరవం మాత్రమే కాదని, అది అదనపు బాధ్యతలను కూడా వెంట తెస్తుందని పేర్కొన్నారు. నిరంతరం అంకితభావంతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.పదోన్నతి పొందిన అధికారులు మాట్లాడుతూ, ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని, ఉన్నతాధికారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విధి నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో 28 వ పటలపు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

