రాజకీయాలకు వెంకన్న లడ్డును వాడుకోవడం దుర్మార్గపు చర్య
1 min read

ఆ దేవుడే కూటమి ప్రభుత్వాన్ని శిక్షిస్తాడు
మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : రాజకీయాలకు పవిత్రమైన తిరుపతి లడ్డు ను వాడుకోవడం దుర్మార్గపు చర్య అని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు వెంకన్న దేవుడిని వాడుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన అన్నారు. కూటమి నాయకులు తిరుమల ప్రసాదం లడ్డూ తయారీకి వాడే నెయ్యి లో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసం కలిసిందని, బాత్రూమ్ కడిగే రసాయనలు కలిపారని తప్పుడు ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనో భావాలు దెబ్బ తీసిన దుర్మార్గపు ఆలోచనలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ఆదేశాల తో జరిగినా దర్యాప్తు సంస్థల మీద దాడి చేయడం, ప్రశ్నిస్తున్న వైకాపా నాయకుల మీద దాడులు చేసి ఇళ్లను తగలబెట్టడం దారుణమన్నారు. చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు, శ్రీ వారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

