నీటి కోసం ప్రజల నిరసన…
1 min read

వెలుగోడు , న్యూస్ నేడు: వెలుగోడు పట్టణం లోని కాలేజీ బైపాస్ రోడ్డు లో చెంచు కాలనీ వద్ద 20 రోజులు గా సక్రమంగా త్రాగు నీరు రావడం లేదంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ప్రజలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. జల జీవన్ మిషన్ కింద కొత్త పైపు లైన్ వేస్తున్నారు. పాత పైపు లైన్ ద్వారా నీరు సక్రమంగా అందుతుండేవి, కొత్త పైపు లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి అంటూ కొత్తవి కనెక్షన్ లు ఇచ్చారు. పథకం ప్రారంభం కాకముందే కొళాయి కనెక్షన్ లు ఇవ్వడం వల్ల అందరికి నీళ్లు చాలడం లేదు. దింతో ఈ పరిస్థితి వచ్చిందంటూ సర్పంచ్ జైపాల్ తెలిపారు. నీటి కొరత ఇబ్బంది ఉన్నందున నీటి ట్యాంకర్ పంపించి నీళ్లు సరఫరా చేస్తానంటూ తెలిపారు. దింతో ప్రజలు శాంతించి వెళ్లారు.

