NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో  స్థానిక తహసీల్దార్  పంచాయతీ కార్యాలయంలో ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మల్లేష్ పంచాయితీ సెక్రెటరి రాజశేఖర్ గౌడ్ కి  వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.రైతు సీఐటీయూ మండల కార్యదర్శిలు వెంకటేష్ నాగరాజు  మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కార్మికులు కర్షకులు ప్రభుత్వ రంగాలలోపనిచేసే ఉద్యోగులు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు మరియుమానసికంగా అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ పాలన నుండి కార్మికులు కర్షకులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను హక్కులను కేంద్రప్రభుత్వం తుంగలో తొక్కి కార్పోరేట్ శక్తులు పారిశ్రామిక వ్యక్తులకు ప్రయోజనం కలిగే విధంగా చట్టాలనుఏ మార్పు చేశారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని రాంజీ పథకాన్ని రద్దు చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వరంగాలలో పనిచేసే కార్మికు లందరికీ కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయకుండా రక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులు కర్షకుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమ్మెక  కార్మికుల అందరూ కదలి రావాలని  కోరారు. ఈ కార్యక్రమంలో తలారి సిద్దలింగ సిద్దలింగ తలారి సిద్ధప్ప తలారి తాయన్న పంచాయతీ కార్మికుల మాబుసుబన్ బాషా గౌడతదితరులు పాల్గొన్నారు.

About Author