క్షేత్రస్థాయిలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు జరుగుచున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల సౌకర్యాలను మరియు బందోబస్తు ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు శ్రీశైల క్షేత్రం నందు లడ్డు కౌంటర్, శివాజీ గోపురం, అమ్మవారి దేవాలయం, గుడి లోపలి ప్రదేశంలోనే వివిధ ప్రాంతాలు, నాగుల కట్ట, చంద్రావతి కళ్యాణ మండపం, విఐపీ ఎంట్రన్స్, హరిహరరాయ గోపురం,మొదలగు ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.


