చంద్రబాబు దృష్టి కి మంత్రాలయం అభివృద్ధి, సమస్యలు
1 min read

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి, సమస్యలను తీసుకుని వెళ్లినట్లు మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. శనివారం అమరావతి లో సచివాలయం లో చంద్రబాబు ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధే మా లక్ష్యమని ప్రజాసేవే మా ధ్యేయం ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి క్షుణ్ణంగా వివరించడం జరిగిందని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

