పత్తికొండ నియోజకవర్గంలో ఆటో ప్రమాదం 15 మందికి తీవ్ర గాయాలు
1 min read

ఆటో ప్రమాద ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ మండలం గుండుతాండ గ్రామం నుంచి మొలగవల్లి కొట్టాల గ్రామానికి కూలి పనికి వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ క్షతగాత్రులతో ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యులకు ఆయన సూచించారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో కూడా ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు.ఇదిలా ఉండగా గిరిజన సంక్షేమ అధికారి వెంకటపతి మరియు ఆర్డీవో భరత్ నాయక్ గారు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం క్షతగాత్రుల బంధువులతో మాట్లాడుతూ బాధితులకు తక్షణ మరియు సమగ్ర వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.


