విద్యార్థులకు ఉచిత కంటి వైద్య చికిత్సలు అద్దాలు అందజేత
1 min read

పత్తికొండ న్యూస్ నేడు: పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల హెచ్ఎం కాటన్ శ్రీదేవి ఆధ్వర్యంలో పగిడిరాయి పి .హెచ్. సి.నేత్ర వై ద్యులు పి .హనుమంత్ రెడ్డి జాతీయ అంధత్వ నివారణ సంస్థ మరియు కర్నూలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఉచిత చికిత్సలు, కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్యులు హనుమంత రెడ్డి మాట్లాడుతూ, మనిషికి కళ్ళు చాలా ప్రధానమైనవి అని వాటిని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు . కంటి చూపును కాపాడుకోవాలంటే విటమిన్. ఎ. కలిగినపదార్థాలు పాలు, గుడ్లు , ఆకుకూర లు, బాగా ఆహారంలో తీసుకోవాలని ఆయన సూచించారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం చాలా ముఖ్యం .కంటి చూపులో మార్పులు నొప్పి లేదా ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నేత్ర వైద్యుడినిసంప్రదించాలని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన దృష్టి నష్టాన్ని నివారించవచ్చని ఆయన పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వపు ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొత్తపల్లి సత్యనారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


